మొటిమలు వాటి మచ్చలతో మీరు బాధపడుతున్నారా? ఎదుటి వారికి మీరు మీ ముఖము చూపించలేకున్నరా? అయితే మీరు బాధ పడవలసిన అవసరం లేదు. కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించి మీరు మీ మొటిమలను వాటి మచ్చలను దూరం చేయవచ్చు.
మొటిమలు రావడం వలన మీ ముఖముపై నల్ల మచ్చలు ఏర్పడుతున్నవి. సూర్యరశ్మి మీ చర్మం మీద ఎక్కువగా పడటం వలన కూడా నల్ల మచ్చలు ఏర్పడతాయి. బయటకు వెళ్ళేటప్పుడు మీ చర్మానికి సన్ స్క్రీన్ లోషన్స్ అప్లై చేయడం ఎంతైనా అవసరం, బయటకు వెళ్ళేటప్పుడు క్రింద ఇవ్వబడిన గృహ చిట్కాలను పాటించడం వలన మొటిమలు వాటివల్ల కలిగే మచ్చల నుంచి విముక్తి చెందవచ్చు.
కెమికల్ ప్రొడక్ట్స్ వాడటం కన్నా మీరు గృహ చిట్కాలను వాడటం మంచిది. దీని ద్వారా మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతే కాకుండా మీరు మంచి ఫలితాన్ని పొందగలరు. మీ చర్మం మొటిమలు మరియు మచ్చలు లేకుండా అందంగా కనిపిస్తుంది.
టమాటో మరియు నిమ్మరసం
కలబంద (Alovera)
కలబంద ఆకుల నుంచి గుజ్జుని తీసి 5 నిమిషముల పాటు ఎండలో ఎండపెట్టాలి. తరువాత దానిలో ఎండిన నిమ్మపండు రసాన్ని 5-6 చుక్కులు కలపవలెను. ఆ పేస్టు ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషముల తరువాత నీటితో కడగాలి. ఇలా చేయడం ద్వారా మీరు మంచి ఫలితాన్ని పొందగలరు.
గంధపు చెక్క మరియు గులాబీ
రెండు టేబుల్ స్పూనుల గంధపు పొడిని తీసుకొని సరిపడే గులాబీ నీటిని కలిపి పేస్టు తయారు చేయాలి. ఆ పేస్టుని ముఖానికి అప్లై చేసి ఎండిన తరువాత నీటితో కడగాలి.
పసుపు మరియు నిమ్మరసం
చిటికెడు పసుపు తీసుకుని దానిలోకి నిమ్మరసాన్ని కలిపి పేస్టు తయారు చేయాలి. ఆ పేస్టుని ముఖానికి అప్లై చేసి నీటితో కడగాలి. ఇలా చేయడం ద్వారా తొందరగా మీ ముఖముపై మచ్చలు తొలగిపోతాయి. ఇలా రోజు చేయడం వలన మీరు ఇంకా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు.
బంగాళదుంప రసం మరియు తేనే
బంగాళదుంప పేస్టు చేసి దానిలోకి కొంచెం తేనెని కలిపి ముఖానికి అప్లై చేసి 15 నిమిషముల తరువాత మంచి నీటితో కడగవలెను. ఇలా చేయడం ద్వారా మీ ముఖము మీద ఉన్న నల్ల మచ్చలు దూరం అవుతాయి. అలానే కాకుండా బంగాళదుంప ముక్కతో మచ్చలు ఉన్న దగ్గర 5 నిమిషముల పాటు రుద్దుతూ ఉండాలి, 15 నిమిషములు అలానే ఉంచి మంచి నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వలన కూడా మీరు మంచి ఫలితాన్ని పొందగలరు.
నిమ్మరసం
నిమ్మరసంలో విటమిన్ C ఎక్కువగా ఉండటం వలన ఇది చర్మంలోని విషపు కణాలను దూరం చేస్తుంది. అలానే మొటిమల వలన వచ్చిన నల్ల మచ్చలను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. నిమ్మరసాన్ని మచ్చలు ఉన్న దగ్గర అప్లై చేయడం వలన మీరు మంచి ఫలితాన్ని పొందగలరు. ఇలా రోజుకి రెండుసార్లు చేయడం ఇంకా మంచిది.
దోసకాయ మరియు పాలు
దోసకాయ పేస్టుని మరియు పాలను కలపాలి దానిలో కొంచెం నిమ్మరసం కలిపి పేస్టు తయారు చేయాలి. ఆ పేస్టుని ముఖానికి అప్లై చేసి 10 నిమిషముల తరువాత మంచి నీటితో కడగవలెను. ఇలా చేయడం ద్వారా మీ ముఖము పైన మచ్చలుపోయి ప్రకాశవంతంగా తయారు అవుతుంది.
బొప్పాయి
బొప్పాయిలో అనేక రకముల ఎంజైములు ఉన్నవి. ఇవి మచ్చలను దూరం చేయుటకు ఉపయోగపడతాయి. బొప్పాయి గుజ్జుని తీసుకొని ముఖము మీద అప్లై చేసి 15 నిమిషముల తరువాత నీటితో కడగాలి.
మజ్జిగ మరియు నిమ్మరసం
మజ్జిగలో లాక్టిక్ ఆసిడ్ మరియు హైడ్రాక్సిల్ ఆసిడ్స్ ఉన్నవి, ఇవి నెచురల్ ఆసిడ్స్. ఇవి చర్మానికి చాలా మంచివి. మజ్జిగ చర్మ కణాలను ఉత్తేజ పరిచి చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి సహకరిస్తుంది. మజ్జిగను ముఖానికి అప్లై చేయడం వలన నల్ల మచ్చలు పోయి కొత్త చర్మం ఏర్పడుతుంది. మజ్జిగలో నిమ్మరసం కలిపి కూడా మీరు ముఖానికి అప్లై చేయవచ్చు. దీని వలన కూడా మీరు మంచి ఫలితాన్ని పొందగలరు.
ఎక్కువగా నీరు తీసుకోవడం
ఎక్కువగా నీరు త్రాగటం వలన మీ ముఖము మీద మచ్చలను తొలగించుటకు సహాయపడుతుంది. కనీసం రోజుకి 6-8 గ్లాసుల నీటిని త్రాగాలి. ఇలా ఎక్కువ నీటిని త్రాగటం వలన మీ చర్మకాంతి పెరగటమే కాకుండా శరీరం లోపల ఉన్న విష కణాలను బయటకు పంపుతుంది.
పచ్చి పాలు
పాలల్లో లాక్టిక్ ఆసిడ్ ఎక్కువగా ఉండటం వలన ఇది మచ్చలు పోగొట్టి చర్మాన్ని మృధువుగా చేస్తుంది. పచ్చి పాలను ముఖానికి అప్లై చేసి 15 నిమిషముల తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా ప్రతిరోజు ఉదయాన్నే చేయడం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు.
పెరుగు మరియు తేనే
పెరుగులో అనేక రకముల ఎంజైమ్స్ ఉన్నవి. ఇవి నల్ల మచ్చలు తొలగించుటకు సహాయ పడుతుంది. తేనే సహజంగా బ్లీచింగ్ తత్వాన్ని కలిగి ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ పెరుగు మరియు 2 టేబుల్ స్పూనుల తేనెని కలిపి పేస్టు తయారు చేసి ముఖానికి అప్లై చేసి 20 నిమిషములు ఉంచాలి. తరువాత చేతులతో రుద్దుతూ గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా ప్రతిరోజు చేయడం వలన మంచి ఫలితాన్ని పొందగలరు.
ఎండుద్రాక్ష మరియు తేనే
ఎర్రని ఎండుద్రాక్ష పండ్ల జాతికి చెందినది. దీనిలో మెలనిన్ ఉండటం వలన ఇది నల్ల మచ్చలను దూరం చేయుటకు సహాయ పడుతున్నది. తేనెలో బ్లేచింగ్ చేసే లక్షణాలు ఎక్కువగా ఉన్నవి. కొన్ని ఎర్రని ఎండుద్రాక్ష తీసుకొని పేస్టు చేసి దానిలో ఒక స్పూన్ తేనే కలపి ముఖానికి అప్లై చేసి 20 నిమిషముల తరువాత నీటితో కడగాలి. ఇలా రోజూ చేయడం వలన మంచి ఫలితాన్ని పొందగలుగుతారు.
ద్రాక్ష మరియు ఆపిల్
ద్రాక్ష మరియు ఆపిల్ రెండిటిలోనూ సహజంగానే విటమిన్లు, ఆసిడ్స్ ఉన్నవి. ఇవి శరీరానికి కాంతివంతంగా చేయుటకు ఉపయోగపడుతున్నవి. ఒక ఆపిల్ ముక్క తీసుకొని రెండు ద్రాక్షలు కలిపి పేస్టు తయారు చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ పేస్టుతో ముఖానికి మసాజ్ కూడా చేసుకోవచ్చు.10 నిమిషముల తరువాత నీటితో కడగాలి. ఇలా ఒక నెల రోజులపాటు చేస్తే మీరు మీ ముఖములో మార్పుని గమనించవచ్చు.
చర్మం మీద మచ్చలను తోలగుంచడానికి కొన్ని చిట్కాలు
- ఎటువంటి మచ్చలు, మొటిమలైన కొన్ని మంచి ఇంటి చిట్కాలను వాడటం వలన వాటిని దూరం చేయవచ్చు. అలాంటి కొన్ని చిట్కాలు పైన ఇవ్వబడినవి. వీటివి పాటించడం ద్వారా మీరు ఒక వారం రోజుల్లోనే ఫలితాన్ని చూడగలరు.
- గంధపుచెక్క మరియు పసుపు లాంటి చిట్కాలు మీరు నెల రోజులపాటు పాటించవలసి ఉంటుంది. అప్పుడే మీరు మంచి అందమైన చర్మాన్ని పొందగలరు.
- కొన్ని చిట్కాలు వయస్సుని బట్టి వాడాలి అని అంటూ ఉంటారు కానీ ఈ చిట్కాలను ఏ వయస్సు కలిగిన వారైన వాడవచ్చు.
- ఇంటి చిట్కాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. వీటిని ఉపయోగించడం వలన చాల కాలం వరకు మీ చర్మం కాంతివంతంగా ఉంటుంది.
- ఒక గొప్ప విషయం ఏమిటి అంటే గృహ చిట్కాలను వాడటం వలన మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
- ఒక గొప్ప సూచన ఏంటి అంటే గృహ చిట్కాల వలన చర్మం కాంతివంతంగా తయారు అవుతుంది. అలానే మీరు తాజా పదార్ధాలు వాడటం వలన మంచి ఫలితం ఉంటుంది.
- ఈ చిట్కాలను ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఉపయోగించడం వలన సూర్యరశ్మి నుంచి విముక్తి చెందవచ్చు.
0 comments:
Post a Comment