-->

728x90 AdSpace

లేటెస్ట్ న్యూస్
మైతెలుగు.ఇన్ఫో(www.mytelugu.info)చూస్తున్నందుకు థాంక్స్, కొత్త గేమ్స్, యాప్స్, మూవీస్, హెల్త్ టిప్స్, వీడియోస్ మరియు ఇతర విషయాలకోసాం తరచు వస్తూ ఉండండి డియర్ రీడర్ ఈ సైట్ లో పోస్ట్లు చుసిన తరువాత ఏదైనా సహాయం కోసం లేదా మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి క్రింద కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చెయ్యండి, మీ కామెంట్స్ ఈ బ్లాగ్ ఇంకా డెవలప్ అవ్వడానికి సహాయపడుతాయి, మీ అభిప్రాయం నాకు చాల విలువైనది ....... థాంక్యూ
Friday, 4 November 2016

సన్ టాన్ని తొలగించుటకు గృహ చిట్కాలు(Telugu tips to remove sun tan)

సూర్యరశ్మి ఉన్నప్పుడే అందరూ ఎంజాయ్ చేసే సమయం. వారి వారి కుటుంబసభ్యులతో మరియు స్నేహితులతో బీచ్ మరియు రిసార్ట్ ఇంకా అనేక చోట్లలో కలుసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ రోజు గడిచే  చివరి సమయంలో అందరూ ఆకర్షణీయంగా కనిపించకపోవటం, శరీరం రంగును కోల్పోవడం మనం గమనిస్తూ ఉంటాము. ఈ రోజుల్లో సన్ టాన్ నుండి రక్షణ పొందుటకు అనేక కాస్మటిక్ ప్రొడక్ట్స్ మరియు బ్లీచింగ్ విధానాలు వచ్చినవి. కాని అవి వాడటం వలన చర్మానికి చాల హానికరం. సహజమైన చిట్కాలను వాడటం వలన శరీరానికి ఎటువంటి హాని కలుగకుండా సన్ టాన్ని తొలగించవచ్చు.

సన్ టాన్ రావడానికి గల కారణాలు

సన్ టాన్ రావడానికి చాలా కారణాలు ఉన్నవి. రసాయనాలను ఎక్కువగా వాడటం వలన లేక రసాయనాల దగ్గర పని చేయడం వలన కూడా సన్ టాన్ వస్తుంది. UV కిరణాలు శరీరం మీద పడటం వలన కూడా సన్ టాన్ వస్తుంది. ఎక్కువగా ఆటలు ఆడేవారికి మరియు కలుషిత వాతావరణంలో తిరిగేవారికి సన్ టాన్ సంభవిస్తుంది. బయటనుండి వచ్చిన తరువాత స్నానం చేయకుండా శరీరం మీద అశ్రద్ధ చేస్తే సన్ టాన్ వచ్చే అవకాశం ఉంది.
మహిళలందరికీ ఒక శుభవార్త మీరు గృహ చిట్కాలను పాటించడం ద్వారా మీ సన్ టాన్ని తొలగించవచ్చు. కొన్ని చిట్కాలు సూచనలు క్రింద ఇవ్వబడినవి.
సన్ టాన్ని తొలగించుటకు ఇంటి చిట్కాలు

తేనే మరియు నిమ్మరసం

తేనెను మరియు నిమ్మరసాన్ని కలిపి పేస్టు తయారు చేసి ఎక్కడైతే సన్ టాన్ ఉందో అక్కడ అప్లై చేసి 10-15 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి. కడిగిన వెంటనే చేతులను కాటన్ టవల్తో తుడవాలి. సన్ టాన్ని పోగొట్టుటకు ఇది ఒక ఉత్తమమైన పద్ధతి.

నిమ్మ మరియు దోసకాయ రసం

సన్ టాన్ని వదిలించుకోవడానికి ఇది ఒక ఉత్తమమైన పద్ధతి. నిమ్మరసం, దోసకాయ రసం మరియు గులాబీ నీటిని కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేసి సన్ టాన్ ఉన్న దగ్గర అప్లై చేయాలి. 10-15 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి. ఈ మిశ్రమం సన్ టాన్ని తొందరగా పోగొట్టుటకు సహకరిస్తుంది. నిమ్మలోని సిట్రిక్ ఆసిడ్ అలనే గులాబీలోని చల్లదనం సన్ టాన్ని తొలగించేలా చేస్తాయి. మీరు ఈ మిశ్రమాన్ని ముందుగా తయారు చేసుకొని ఒక వారం రోజులపాటు రీఫ్రేజిరేటర్లో నిలువ చేసుకోవచ్చు.
నిమ్మరసాన్ని సన్ టాన్ ఉన్న దగ్గర రాస్తూ మసాజ్ చేసి 10-15 నిమిషముల తరువాత ఆ సొల్యూషన్ అంతా ఎండిపోయిన తరువాత చల్లని నీటితో కడగాలి.

పెరుగు మరియు శనగపిండి

పెరుగు, శనగపిండి మరియు నిమ్మరసం కలిపి పేస్టు తయారు చేయాలి. ప్రతీ పదార్ధం యొక్క పరిమాణాలు ఒక్కటేలా ఉండాలి. ఈ పేస్టుని సన్ టాన్ ఉన్న చోట అప్లై చేయాలి. 10 నిమిషముల తరువాత పేస్టు ఎండిపోతే దానిని గోరువెచ్చని నీటితో కడగాలి. ఇది సన్ టాన్ని తొలగించి చర్మం కాంతివంతంగా ఉండేటట్లు చేస్తుంది.


పసుపు మరియు పచ్చి పాలు

పాలల్లో పసుపు మరియు నిమ్మరసం కలిపి టాన్ ఉన్నచోట అప్లై చేయాలి. 10 నిమిషముల తరువాత పేస్టు ఎండిపోతే చల్లని నీటితో కడగాలి. ఇలా ముఖానికి అప్లై చేయటం వలన మంచి ఫలితం కనిపిస్తుంది.
అలానే మీరు సన్ టాన్ ఉన్నచోట కొబ్బరి నీటిని అప్లై చేసి ఆరిన తరువాత నీటితో కడగాలి. ఇలా రోజూ  చేయడం వలన మీకు మంచి ఫలితం ఉంటుంది.


బొప్పాయి

మీకు బొప్పాయితో టాన్ చర్మాన్ని వదిలించుకోవడం ఏంటి అని ఆశ్చర్యం కలిగిందా? బొప్పాయి గుజ్జు కూడా సన్ టాన్ని పోగొట్టుటలో సహకరిస్తుంది. బొప్పాయి గిజ్జుని తీసుకొని ఎక్కడైతే టాన్ స్కిన్ ఉందో అక్కడ 10-15 నిమిషములపాటు మసాజ్ చేసి, 10-15 నిమిషముల తరువాత ఆరిన ఫీలింగ్ కలిగితే చల్లని నీటితో కడగాలి.

ముల్తాని మట్టి మరియు సొరకాయ

మనకు సొరకాయ మార్కెట్లో చాల సులువుగా లభిస్తుంది. సొరకాయ గుజ్జుని తీసుకొని దానిలోకి ముల్తాని మట్టిని కలిపి పేస్టు తయారు చేసి దానిని సన్ టాన్ ఉన్నచోట ముఖము, మెడ మరియు చేతులకు అప్లై చేయాలి. చల్లని నీటితో కడిగిన తరువాత ఫలితాన్ని మీరు గమనించవచ్చు.

ఇలానే కాకుండా సూర్యరశ్మి మీ మీద పడకుండా జాగ్రత్త తీసుకోవడం వలన కూడా మీకు టాన్ స్కిన్ రాకుండా ఉంటుంది. 10.00 నుంచి 4.00 గంటల మధ్యలో బయటకు వెళ్లకపోవడం మంచిది. ఒకవేళ ఆ సమయంలో బయటకు వెళ్ళవలసి వస్తే మీరు SRF గుర్తు ఉన్న సన్ స్క్రీన్ లోషన్ని వాడవచ్చు. అలనే మీ మీద సూర్యరశ్మి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులకు గ్లౌస్ మరియు ముఖానికి మాస్క్ వేసుకోవడం మంచిది.

మెడ మీద సన్ టాన్ని తొలగించుట

మీకు నల్లటి మెడ ఉండటం వలన ఇబ్బంది పడుతున్నారా?  మెడ మీద నల్ల రంగు రావడానికి గల కారణం సూర్యరశ్మి మరియు కాలుష్యం. సన్ టాన్ ఎక్కువగా బయటకు కనిపించే శరీరం దగ్గర వస్తుంది మొఖము, మెడ, కాళ్లు మరియు చేతులు మొదలగువాటి మీద వస్తుంది. క్రింద మెడ మీద వచ్చే టాన్ని తొలగించడానికి చిట్కాలు ఇవ్వబడినవి.

దోసకాయ రసం, పసుపు మరియు నిమ్మరసం

ఇది ఒక ప్రత్యేకమైన ప్యాక్ ఎందుకంటే పసుపులో యాంటిసెప్టిక్ లక్షణాలు ఉన్నవి. అలానే దోసకాయలో క్లీనింగ్ ఏజెంట్ మరియు నిమ్మలో సిట్రిక్ ఆసిడ్ గుణములను కలిగి ఉన్నవి. ఒక టేబుల్ స్పూన్ పసుపు, దోసకాయ రసం మరియు నిమ్మరసం తీసుకొని ప్యాక్ తయారు చేసి, టాన్ ఉన్న మెడకు అప్లై చేయాలి. 20 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా రోజు చేయడం వలన మంచి ఫలితాన్ని పొందగలరు.

నిమ్మకాయ

నిమ్మకాయ సహజంగా బ్లీచ్ గా పనిచేస్తుంది అలానే దీనిలో కొత్త చర్మ కణాలను ఉత్తేజపరిచే శక్తి ఉంది. నిమ్మకాయ ముక్కతో మెడమీద రుద్దుతూ ఉండాలి. లేకుంటే నిమ్మరసాన్ని గులాబీ నీటిని కలిపి అప్లై చేయాలి. ఇలా చేయడం వలన మెడమీద టాన్ తొలగుతుంది. ఇలా రోజూ చేయడం వలన మంచి ఫలితాన్ని పొందగలరు.

కొబ్బరినూనె

మనం మన పూర్వికులు చెప్పే మాటలను పట్టించుకోవడం లేదు, వారు ఆయిల్ని రోజూ జుట్టుకు మరియు తలకు అప్లై చేయమని చెప్తుంటారు. ఈ ఆయిల్ టాన్ని తొలగించడంలో అలానే చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి  చాలా బాగా పని చేస్తుంది. టాన్ స్కిన్ని పోగొట్టడానికి రోజు మెడ మీద కొబ్బరి నూనెతో మసాజ్ చేయాలి. సహజంగా వచ్చిన కొబ్బరి నూనెను వాడటం వలన మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మరియు ఎటువంటి ఎలర్జీలు రావు. మీరు రోజు మీ శరీరం మీద కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వలన సన్ టాన్ తగ్గటమే కాకుండా చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

పంచదార మరియు ఆయిల్

దీనిని మీరు మీ సొంతగా తయారు చేసుకోవచ్చు. చాల సులువైన పదార్ధాలతో దీనిని తయారు చేయవచ్చు. ఒక స్పూన్ పంచదార, 3 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ తీస్కోవాలి, అవసరం అనుకుంటే కొంచెం నిమ్మరసాన్ని కూడా కలపవచ్చు. దీనిని మీ మెడకు మరియు ముఖానికి చేతులతో అప్లై చేస్తూ మసాజ్ చేయాలి. 2-3 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వలన టాన్ స్కిన్ పోయి చర్మం కాంతివంతంగా తయారు అవుతుంది.

పైన్ఆపిల్ మరియు బొప్పాయి

పైన్ఆపిల్ మరియు బొప్పాయిని పేస్టులా చేసి ముఖము మరియు నుదిటిపై అప్లై చేయాలి. 10 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి. మార్కెట్లో లభించే టాన్ క్రీమ్స్ వాడటం కన్నా ఈ పేస్టు వాడటం చాల ఉత్తమం. ఇది వాడటం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది మీ ముఖము మరియు నుదిటి మీద ఉండే టాన్ని తొలగించడానికి ఉపయోగపడుతున్నది.

బంగాళదుంప

యాంటిటాన్ కూరగాయలలో బంగాళదుంప ఒకటి. బంగాళదుంపని ఉపయోగించి టాన్ని (tan) తొలగించవచ్చు. మిక్సర్ని ఉపయోగించి బంగాళదుంప పేస్టు చేసి ముఖానికి అప్లై చేసి 15 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి. మంచి ఫలితం కోసం ఇలా రోజూ చేయాలి. మీరు బంగాళదుంప చిట్కాల కోసం చూస్తుంటారు కదా ఎందుకంటే అది మన వంటగదిలో ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా బంగాళదుంప పేస్టు చేసుకొని ముఖానికి అప్లై చేసుకోండి. ఇలా చేయడం వలన మీ ముఖము ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

నిమ్మరసం మరియు పంచదార

నిమ్మరసం తీసి దానిలోకి పంచదార కలపవలెను. దీనిని ముఖానికి రాస్తూ మసాజ్ చేయాలి. ఇలా చేయడం వలన టాన్ చర్మం పోయి మంచి చర్మంఏర్పడుతుంది. కొన్ని వారాలలో ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీనిని ఉపయోగించడం వలన మీ చర్మం ప్రకాశవంతంగా అవుతుంది. టాన్ని తొలగించడానికి ఇది ఒక సాధారణమైన పరిహారం.

పెరుగు మరియు శనగపిండి

మీకు ఎంత కావాలి అంటే అంత మోతాదులో శనగపిండి, నిమ్మరసం మరియు పెరుగు తీసుకొని పేస్టు తయారు చేయాలి. పేస్టుని ముఖానికి అప్లై చేసి 15 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి. ఇది ఒక ప్రత్యేకమైన ఇంటి చిట్కా దీనిని వారానికి మూడుసార్లు చేయడం వలన మీకు మంచి ఫలితం కలుగుతుంది.

అలోవేర, టమాటో మరియు కందిపప్పు

ఇది ఒక ఉత్తమమైన పేస్ ప్యాక్, దీని వలన మీరు మీ శరీరం మీద వచ్చిన సన్ టాన్ని తొలగించవచ్చు. మన ఇంట్లో ఉండే కందిపప్పు సన్ టాన్ని తొలగించే ఒక ఉత్తమమైన పదార్ధం. కందిపప్పుని 15 నిమిషములపాటు నానపెట్టి మిక్సర్ సహాయంతో పేస్టు తయారు చేయాలి. ఈ పేస్టులో అలోవేర గుజ్జును మరియు టమాటో గుజ్జును కలపాలి. పేస్టును ముఖానికి మరియు మెడకి మసాజ్ చేస్తూ రాయాలి. 15 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి.

సన్ టాన్ వలన హానికరమైన ప్రభావం

సూర్యరశ్మి ఎక్కువగా మీ శరీరానికి తగలటం, దాని వలన UV కిరణాలు మీ చర్మం మీద పడటం ద్వారా సన్ టాన్ ఏర్పడుతుంది. సన్ టాన్ ఎక్కువగా ముఖానికి, మెడకు, చేతులకు మరియు కాళ్ళకు వస్తుంది. దీనివలన మీ చర్మం మీద మొటిమలు, మచ్చలు, ముడతలు ఏర్పడి అనేక రకముల చర్మ వ్యాధులకు దారి తీస్తుంది. ఇది చివరకు కెన్సర్కు కారణం అవుతుంది.

సన్ టాన్ని తొలగించుటకు నివారణ చర్యలు

మార్కెట్లో లభించే సన్ టాన్ కస్మటిక్ ప్రొడక్ట్స్ వలన చర్మానికి చాల హాని కలుగుతుంది. వీటిలో చాల రసాయనిక పదార్ధాలు వాడటం వలన చర్మానికి మంచిది కాదు, హానికరం. కొన్ని ఆయుర్వేదిక మరియు హెర్బల్ ప్రొడక్ట్స్ వాడటం ద్వారా మీ చర్మానికి ఎటువంటి హాని కలుగదు.

టమాటో, పెరుగు మరియు నిమ్మరసం

ఇది నల్ల మచ్చలను తొలగించడానికి చాల బాగా పని చేస్తుంది. దీనిలో సిట్రిక్ ఆసిడ్ ఉండటం వలన చర్మాన్ని కాంతివంతంగా చేసి జిడ్డు తనాన్ని పోగొడుతుంది. 2 టేబుల్ స్పూన్స్ టమాటో పేస్టు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మరియు ఒక టేబుల్ స్పూన్ పెరుగు తీసుకొని పేస్టు తయారు చేయాలి. దీనిని ముఖానికి అప్లై చేసి 30 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి.

అలోవేర, కందిపప్పు మరియు టమాటో

కందిపప్పు టాన్ని(tan) తొలగించడానికి సహాయ పడుతుంది. అలోవేర మరియు టమాటో చర్మ కణాలను ఉత్తేజ పరిచే గుణాలను కలిగి ఉంది. కందిపప్పుని 20 నిమిషములు నానపెట్టి పేస్టు తయారు చేయాలి. కందిపప్పు పేస్టులో ఒక టేబుల్ స్పూన్ అలోవేర గుజ్జు మరియు టమాటో రసాన్ని కలిపి పేస్టు తయారు చేయాలి. దీనిని మెడకు మరియు ముఖానికి మసాజ్ చేస్తూ అప్లై చేయాలి. 20 నిమిషముల తరువాత నీటితో కడగాలి.

వోట్ మీల్ మరియు మజ్జిగ

వోట్ మీల్ చర్మం మీద బ్లాక్ హెడ్స్ని తొలగించడానికి మరియు మజ్జిగ చర్మాన్ని మృదువుగా చేయడానికి ఉపయోగపడుతున్నవి. 2 టేబుల్ స్పూనుల వోట్ మీల్స్ మరియు 3 టేబుల్ స్పూనుల మజ్జిగను తీసుకొని పేస్టు తయారు చేయాలి. ఈ పేస్టును ముఖానికి మరియు శరీరానికి అప్లై చేసి చేతులను వృత్తాకారంగా తిప్పుతూ మసాజ్ చేయాలి. 15 నిమిషముల తరువాత నీటితో కడగాలి.

నారింజ రసం మరియు పెరుగు

నారింజలో C విటమిన్ ఎక్కువగా ఉండటం వలన చర్మం మీద టాన్ని తొలగించి వృధ్ధాప్య చాయలను తొందరగా రాకుండా చేస్తుంది. పెరుగు సహజంగా బ్లీచింగ్ గుణాలను కలిగి ఉంది. ఒక స్పూన్ నారింజ రసం మరియు ఒక స్పూన్ పెరుగు తీసుకొని ముఖానికి అప్లై చేయాలి. 30 నిమిషముల తరువాత నీటితో కడగాలి.

బంగాళదుంప మరియు నిమ్మరసం

బంగాలదుంపను ఆహారంగా తీసుకోవడం చర్మానికి లాభదాయకం. దీనిలో అనేక రకాల ప్రోటీన్లు, విటమిన్లు ఉండటమే కాకుండా పీచు తత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచి చర్మ మీద వచ్చే మంటను పోగొడుతుంది. అలానే చర్మాన్ని నున్నగా చేస్తుంది. బంగాళదుంప మరియు నిమ్మరసంతో పేస్టు తయారు చేసి ముఖానికి అప్లై చేసి 40 నిమిషముల తరువాత నీటితో కడగవలెను.
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: సన్ టాన్ని తొలగించుటకు గృహ చిట్కాలు(Telugu tips to remove sun tan) Rating: 5 Reviewed By: prakash reddy