-->

728x90 AdSpace

లేటెస్ట్ న్యూస్
మైతెలుగు.ఇన్ఫో(www.mytelugu.info)చూస్తున్నందుకు థాంక్స్, కొత్త గేమ్స్, యాప్స్, మూవీస్, హెల్త్ టిప్స్, వీడియోస్ మరియు ఇతర విషయాలకోసాం తరచు వస్తూ ఉండండి డియర్ రీడర్ ఈ సైట్ లో పోస్ట్లు చుసిన తరువాత ఏదైనా సహాయం కోసం లేదా మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి క్రింద కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చెయ్యండి, మీ కామెంట్స్ ఈ బ్లాగ్ ఇంకా డెవలప్ అవ్వడానికి సహాయపడుతాయి, మీ అభిప్రాయం నాకు చాల విలువైనది ....... థాంక్యూ
Monday, 3 October 2016

ఏడిస్తే ఆనందంగా ఉంటారట

నవ్వు ఒక భోగం... నవ్వించడం యోగం... నవ్వలేకపోవడం రోగం అంటారు. మరి ఏడుపు గురించి ఎవరూ చెప్పరే. ఏడవడం కూడా ఆరోగ్యమే. సాధారణంగా మనం బాధలో ఉన్నప్పుడు ఏడుస్తుంటాం. అలా ఏడవడం వల్ల శరీరంలోని కలుషిత పదార్థాలు బయటకుపోతాయట. అలాగే కన్నీళ్లు మనిషికి రిలాక్స్‌నిస్తాయట. ఏడిస్తే మనసు తేలికవుతుంది. కంటిలోని పొరలను శుభ్రం చేయడానికి, కళ్ళను తడిగా ఉంచడానికి వచ్చే ద్రవాలే కన్నీళ్లు. కంటి కార్నియాను తడిగా, శుభ్రంగా ఉంచేందుకు, దుమ్మును, నివారించేందుకు, పోషకాల్ని అందించడానికి కన్నీళ్లు ఉపయోగపడతాయి. కన్నీళ్లలో నీరు, మ్యుసిన్, లిపిడ్‌ , లైసోజైములు, లాక్టోఫెర్రిన్, ఇమ్యునోగ్లోబిలిన్‌, గ్లూకోస్, యూరియా, సోడియం, పొటాషియం వంటి అనేక పదార్ధాలు ఉంటాయి.

మనస్సు నిండా బాధ ఉంచుకోవడం కంటే ఏడిస్తేనే ఆరోగ్యంగా ఉంటారట. కన్నీళ్ల ద్వారా మాంగనీసు, పొటాషియం, ప్రొలాక్టిన్ బయటకు వెళ్తాయి. రక్తం గడ్డ కట్టడానికి, చర్మ వ్యాధులను నయం చేయడానికి, కొలెస్ట్రాల్ (కొవ్వు)ను తగ్గించడానికి కొద్ది మోతాదు మాంగనీసు సరిపోతుంది. నరాలు పనిచేయడానికి, కండరాల నియంత్రించడానికి, బీపీని అదుపులో ఉంచడానికి పొటాషియం ఉపకరిస్తుంది. ఒత్తిడి నివారించడానికి, శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, వివిధ అవయవాలను ప్రభావవంతంగా పనిచేయించడానికి ప్రొలాక్టిన్ హార్మోన్ ఉపయోగపతుంది. ఒకవేళ శరీరంలో వీటి మోతాదు ఎక్కువ ఉంటే ఇవి కన్నీళ్ల ద్వారా బయటకు వెళ్లడమే మంచిది.




ఏడవడం వల్ల శరీరంలోని విషతుల్యమైన రసాయనాలు బయటకుపోతాయి. మూడ్‌ బాగవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదు ఎమోషనల్‌, ఫిజికల్‌ బాధలు కూడా తగ్గుతాయి. మొత్తానికి ఏడ్చిన తర్వాత ఆనందంగా ఉంటారట. అలాగే ఎవరైనా ఏడుస్తుంటే వారికి ఓదార్పునివ్వడం కూడా ఎంతో అవసరం. ఓదార్చడం వల్ల ఒక అండ దొరికినట్టు వారు ఫీలవుతారు. అది వారిలోని ప్రెజర్ ను తగ్గిస్తుంది. అయితే యవ్వనంలోకి అడుగుపెట్టేవరకూ ఆడ, మగ పిల్లల ఏడుపులో తేడా ఉండదు. ఇద్దరూ సమంగా ఏడుస్తారు. ఆ తర్వాతే టెస్టోస్టెరోన్స్‌ అబ్బాయిల్లో ఈ గుణాన్ని తగ్గిస్తాయట. అమ్మాయిలు ఎక్కువగా ఏడవడానికి ఈస్ట్రోజన్‌, ప్రొలాక్టిన్లు కారణమట. అయితే బాధలో ఏడవడానికి జెండర్ తో సంబంధం లేదట.
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: ఏడిస్తే ఆనందంగా ఉంటారట Rating: 5 Reviewed By: prakash reddy